టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీతో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు భారత ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మైదానంలో, బయటా సహచరులతో చురుగ్గా ఉండే హిట్‌మ్యాన్ శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాత ఫొటోని పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
భారత ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాతో కలిసి ఉన్న పాత చిత్రాన్ని ఉంచి.. "మాతో జ్లాటన్ ఉన్నాడు. వారితో ముచ్చటించిన క్షణాలు ఎంతో సరదాగా ఉంటాయి" అని పోస్ట్ చేశాడు. జ్లాటన్ స్వీడన్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఫుట్‌బాల్ అభిమానులకు అతడు సుపరిచితుడే. అయితే జ్లాటన్ పోనీటైల్ మాదిరిగానే ఇషాంత్‌శర్మ హెయిర్‌స్టైల్ ఉండటం వల్ల రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు.