రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో ద్విశతకం చేసిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఓ టెస్టు సిరీస్‌లో 500కు పైగా పరుగులు చేసిన 5వ భారత బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు.
రోహిత్ కంటే ముందు వినూ మన్కడ్, బుధి కుందెరన్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. గవస్కర్.. ఓ సిరీస్‌లో 500కు పైగా పరుగులను 5 సార్లు చేశాడు. చివరిగా సెహ్వాగ్.. 2005లో పాకిస్థాన్‌పై 544 పరుగులు చేశాడు.
వన్డే, టెస్టు.. రెండు ఫార్మాట్లలో డబుల్ సెంచరీ చేసిన 4వ బ్యాట్స్‌మన్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు హిట్ మ్యాన్. అతడి కంటే ముందు సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్ ఉన్నారు. స్వదేశంలో అయితే ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడు రోహిత్.
ఓ టెస్టు సిరీస్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ రోహిత్ రికార్డు అందుకున్నాడు. 17 సిక్సర్లతో ముందువరుసలో ఉన్నాడు.విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు చేసి, ఓపెనర్‌గా తానేంటో నిరూపించాడీ క్రికెటర్.
ఇదీ చదవండి: కొనసాగుతోన్న రోహిత్ రికార్డుల వేట