పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్ శర్మపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆ జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా చేరాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు హిట్‌మ్యాన్ లేకపోవడం టీమ్ఇండియాకు చాలా పెద్ద లోటు అని అభిప్రాయపడ్డాడు. అలానే రోహిత్ అంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయని తెలిపాడు.
"రోహిత్ మ్యచ్ విన్నర్. అతడి చూసి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల వెన్నులో వణుకుపుడుతుంది. ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు అతడు దూరమవ్వడం టీమ్ఇండియాకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది"
-రమీజ్ రాజా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
టీమ్ఇండియాలో బ్యాటింగ్ లైనప్ బాగుందని చెప్పిన రమీజ్.. బౌలింగ్ విభాగం ఇంతకముందు కన్నా బాగా మెరుగుపడిందని అన్నాడు. గతంలో కన్నా ఆస్ట్రేలియలోని పిచ్‌లను ప్రస్తుతం బాగా సిద్ధం చేస్తున్నారని చెప్పాడు. "వీక్షకుల సంఖ్య పెరగడం కోసం, వారి అవసరాలకు అనుగుణంగా భారత్‌తో ఐదు రోజుల పాటు టెస్టులను ఆసీస్ ఆడాలనుకుంటుంది" అని తాను భావిస్తున్నట్లు రాజా తెలిపాడు.