నేటి(సెప్టెంబరు 19) నుంచి ఐపీఎల్ సందడి ప్రారంభం కానుంది. నాలుగుసార్లు ట్రోఫీ గెల్చుకున్న ముంబయి ఇండియన్స్.. తొలి మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌తో తలపడనుంది. గతంలో ఇరుజట్ల మధ్య చాలా మ్యాచ్‌లు జరిగాయి. అందులో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడు
చెన్నైసూపర్‌కింగ్స్‌తో ఇప్పటివరకు 27 మ్యాచ్‌లాడి 705 పరుగులు చేశాడు. ధోనీ సేనపై ఏడు వందల పరుగుల మార్క్‌ను అందుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు కోహ్లీ ఉన్నాడు.
అత్యధిక ఫోర్స్‌లో రెండో స్థానం
సీఎస్కేపై రోహిత్ 54 ఫోర్లు బాదాడు. చెన్నై జట్టుపై అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శిఖర్ ధావన్(70) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. 25 సిక్సర్లతో ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.