తన అమ్మ ఊరు విశాఖపట్నంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 127 పరుగులు(149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) రెచ్చిపోయి ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్వితీయ శతకం బాదేశాడు. ఫిలాండర్ వేసిన 52 ఓవర్ 5 బంతికి సింగిల్ తీసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓపెనర్‌గా అరంగేట్రంలోనే రెండు ఇన్నింగ్సుల్లోనూ శతకాలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు.
అరంగేట్ర ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనతనూ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు 176 పరుగులు చేశాడు. మొత్తం తొలి టెస్టులో 303 పరుగులు చేశాడు.
అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు...
- 303 రోహిత్ శర్మ v (విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాపై-2019/20)
- 208 కే వెసెల్స్v (బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లాండ్‌పై- 1982/83)
- 201 బీ కురుప్పు v(కొలంబో వేదికగా న్యూజిలాండ్‌పై-1986/87)
- 200 ఏ జాక్సన్ v (అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్‌పై-1928/29)
- 200 జీ గ్రీనిడ్జ్ v(బెంగళూరు వేదికగా భారత్‌పై-1974/75)
సెంచరీ తర్వాత హిట్‌మ్యాన్ మరింత రెచ్చిపోయాడు. భారీ సిక్సర్లే లక్ష్యంగా ఆడాడు. డేన్ పీడ్ వేసిన 56వ ఓవర్‌లో చివరి మూడు బంతులను అద్భుతమైన సిక్సర్లుగా మలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫలితంగా మూడు ఫార్మాట్లలోనూ భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.