లాక్‌డౌన్ కారణంగా టోర్నీలు, లీగ్‌లు నిలిచిపోవడం వల్ల క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఉప సారథి రోహిత్ శర్మ.. సోషల్‌మీడియాలో పలువురు క్రికెటర్లతో లైవ్‌చాట్ చేశాడు. అందులో భాగంగా పేసర్ బుమ్రాతో, హిందీలో మాట్లాడాడు. కొందరు అభిమానులు అతడిని ఇంగ్లీష్‌లో మాట్లాడాలని కోరారు. తాము భారతీయులమని, హిందీలోనే మాట్లాడతామని స్పష్టం చేశారు.
టీవీ ఇంటర్వ్యూల్లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతానని, ప్రస్తుతం ఇంట్లో ఉన్నందున హిందీలో మాట్లాడుతున్నట్లు హిట్‌మ్యాన్ చెప్పాడు.
రోహిత్‌కు మద్దతుగా బుమ్రా
రోహిత్ శర్మకు అండగా నిలిచాడు బుమ్రా. 'మనం హిందీలో మాట్లాడితే వాళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడమంటారు, ఇంగ్లీష్‌లో మాట్లాడితే హిందీలో మాట్లాడమంటారు' అని అన్నాడు. కరోనా వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని తానెప్పుడూ ఊహించలేదని జస్ప్రీత్ చెప్పాడు.
వైరస్ వ్యాప్తి వల్ల అన్ని క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయని, దీన్నిబట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కొందరు అభిమానులను ఉద్దేశించి రోహిత్ అన్నాడు. ప్రతి ఒక్క పౌరుడిని ఇంట్లోనే ఉండి, తరచూ చేతులు కడుక్కోవాలని సూచించాడు.