తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఇర్ఫాన్ పఠాన్

రోహిత్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్ గురించి, అతడి విజయవంతం కావడానికి గల కారణాల్ని వెల్లడించాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాల్ని చెప్పాడు.

రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఇర్ఫాన్ పఠాన్
రోహిత్ శర్మ ఇర్ఫాన్ పఠాన్

By

Published : Jun 28, 2020, 2:02 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్ రోహిత్​శర్మ.. బ్యాట్స్​మెన్​గా ఇంతలా సక్సెస్​ కావడం వెనకున్న రహస్యాన్ని వెల్లడించాడు మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. 2011 వన్డే ప్రపంచకప్​లో చోటు దక్కనందుకు చాలా బాధపడ్డాడని, ఆ తర్వాత తీవ్రంగా శ్రమించి జట్టులో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడని చెప్పాడు. 'క్రికెట్ కనెక్టడ్' కార్యక్రమంలో మాట్లాడిన ఇర్ఫాన్.. వీటితో పాటే చాలా విషయాల్ని పంచుకున్నాడు.

"నింపాదిగా బంతిని ఎదుర్కొనేందుకు చాలా సమయం ఉందన్నట్లుగా అడే రోహిత్ లాంటి బ్యాట్స్​మెన్​ను చాలామంది అపార్థం చేసుకుంటారు. మరింత కష్టపడాలని వారికి సూచనలిస్తూ ఉంటారు. వసీమ్​ జాఫర్​కు ఇలానే చెప్పారు. అయితే వీరిలాంటి క్రికెటర్లు ఎంతో కష్టపడతారు. ఇలానే ఆడే రోహిత్​శర్మ.. జట్టు ప్రయోజనాలో ప్రాధాన్యమని అనుకుంటూ ఆడుతుంటాడు" -ఇర్ఫాన్ పఠాన్, భారత మాజీ ఆల్​రౌండర్

టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ

2007లో అరంగేట్రం చేసిన రోహిత్​శర్మ.. అదే ఏడాది టీ20 ప్రపంచకప్​ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే పలు మ్యాచ్​లు ఆడిన హిట్​మ్యాన్, నిలకడలేమి కారణం​ స్థానం కోల్పోయాడు. 2011 ప్రపంచకప్​లో పాల్గొనలేకపోయాడు. దీంతో తీవ్రంగా శ్రమించిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఓపెనర్​గా మారాడు. అప్పటినుంచి ఇప్పటివరకు తనదైన బ్యాటింగ్​ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడేళ్ల వ్యవధిలోనే వన్డేల్లో మూడు ద్విశతకాలు చేసి, ఏ బ్యాట్స్​మన్​కు సాధ్యం కానీ ఘనత సాధించాడు. గతేడాది ప్రపంచకప్​లోనూ ఐదు శతకాలు చేసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం టీమ్​ఇండియాలో వైస్​ కెప్టెన్​గా, ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details