టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతడి బౌలింగ్ యాక్షన్, పేస్, యార్కర్లకు ఫిదా అవుతుంటారు. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ కుమార్తె సమైరా.. బుమ్రాకు అభిమానిగా మారినట్లుంది. ఈ పేసర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఈ విషయం తెలుస్తోంది.
ఈ వీడియోలో రోహిత్.. కూతురు సమైరాతో ఆడుకుంటూ ఉంటాడు. పక్కన ఉన్న అతడి భార్య రితిక.. బుమ్రా బౌలింగ్ ఎలా చేస్తాడని ఆ చిన్నారిని అడుగుతుంది. అప్పుడు సమైరా జస్ప్రీత్ను అనుకరించి చూపిస్తుంది. దీంతో హిట్మ్యాన్ నవ్వుతాడు.