తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ లేకపోతే రోహిత్​కే మంచిది: మెక్​గ్రాత్

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో కోహ్లీ ఆడకపోవడం రోహిత్​కు మంచిదని దిగ్గజ పేసర్ మెక్​గ్రాత్ చెప్పాడు. ఈ సిరీస్​లో బ్యాటింగ్​లో అదరగొడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Rohit Sharma can step up in Virat Kohli's absence in australia series: Glenn McGrath
కోహ్లీ లేకపోతే రోహిత్​కే మంచిది: మెక్​గ్రాత్

By

Published : Nov 17, 2020, 12:05 PM IST

ఆస్ట్రేలియా సిరీస్‌లోని చివరి మూడు టెస్టులకు కెప్టెన్‌ కోహ్లీ దూరమవ్వడం వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కలిసొస్తుందని ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్లలో ఎన్నో ఘనతలు సాధించిన హిట్‌మ్యాన్‌.. సుదీర్ఘఫార్మాట్‌లో పెద్దగా సత్తాచాటలేదని, విరాట్ గైర్హాజరీతో ఆ లోటును తీర్చుకుంటాడని అన్నాడు.

"రోహిత్ శర్మ నాణ్యమైన బ్యాట్స్‌మన్‌. కానీ, టెస్టుల్లో గొప్పగా ఏమీ సాధించలేదు. ఈ సారి తొలి టెస్టు తర్వాత కోహ్లీ స్వదేశానికి వెళ్లడం రోహిత్‌కు కలిసొస్తుంది. విరాట్ గైర్హాజరీలో అతడు ఒక్కడే రాణిస్తాడని భావించలేం. అజింక్య రహానె, పుజారా, కేఎల్‌ రాహుల్‌తో భారత్‌కు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. వీరిలో ఎవరైనా ఆస్ట్రేలియా సిరీస్‌లో తమదైన ముద్ర వేయొచ్చు. అది రోహిత్‌ చేస్తాడని భావిస్తున్నా" -మెక్‌గ్రాత్, ఆసీస్ మాజీ పేసర్

కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, 2021 జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ కారణంతోనే విరాట్ పితృత్వ సెలవులు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత అతడు భారత్‌కు తిరిగొస్తాడు. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ ఆసీస్ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యాడు. డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. నవంబర్‌ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో టీమ్​ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.

ABOUT THE AUTHOR

...view details