టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత అంతటి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు. గతేడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అరుదైన రికార్డులకు అడుగు దూరంలో ఉన్నాడు. రోహిత్ శర్మ వాటిని ఈ ఏడాదే అధిగమించే అవకాశముంది. అవేంటో ఇప్పుడు చూద్దామా.
అత్యధిక టీ20 మ్యాచ్‌లు
రోహిత్ శర్మ.. అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్(111 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. 104 టీ20లు ఆడిన హిట్ మ్యాన్.. మాలిక్ రికార్డును అందుకునేందుకు ఇంకో ఏడు మ్యాచ్‌లు ఆడితే సరిపోతుంది.
భారత క్రికెటర్ రోహిత్‌శర్మ ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా 17 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో గాయాల బారిన పడకుండా ఇదే ఫామ్‌లో ఉంటే రోహిత్‌కు మాలిక్ రికార్డు అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు
స్ట్రోక్ ప్లేయర్‌గా రోహిత్ శర్మకు మంచి గుర్తింపు ఉంది. పుల్ షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, సులభంగా సిక్సర్లు బాదేస్తాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు హిట్ మ్యాన్.
భారత క్రికెటర్ రోహిత్‌శర్మ పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు భారత మాజీ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 31 మ్యాచ్‌ల్లో 33 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు యువీ. రోహిత్.. 28 మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో హిట్ మ్యాన్.. ఆ ఘనత సాధించే అవకాశముందని అభిమానులు ఆశిస్తున్నారు. మరో పది సిక్సర్లు బాదితే ఈ ఏడాదే యువీ రికార్డును అధిగమిస్తాడు రోహిత్.
ఒక జట్టుపై 100 సిక్సర్లు
జట్టు ఏదైనా అదే జోరు కొనసాగిస్తూ.. అలవోకగా బౌండరీలు కొడుతుంటాడు రోహిత్. దాదాపు అన్ని జట్లపైనా సిక్సర్లతో విరుచుకుపడిన ఈ బ్యాట్స్‌మన్.. అత్యధికంగా ఆస్ట్రేలియాపై కొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 61 మ్యాచ్‌ల్లో 93 సిక్సర్లు బాది వందకు చేరువలో ఉన్నాడు.
భారత క్రికెటర్ రోహిత్‌శర్మ ఈ నెల 14న ఆసీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి 2021 జనవరి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 18 ఇన్నింగ్స్‌లు(3 వన్డేలు, 3టీ20లు, 6 టెస్టు ఇన్నింగ్స్‌లు) ఆడనుంది టీమిండియా. కాబట్టి అతడు ఈ ఏడాదే ఈ రికార్డూ బద్దలు కొట్టే అవకాశముంది. ఓ జట్టుపై 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత విండీస్ వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఇంగ్లాండ్‌పై అతడు 69 మ్యాచ్‌ల్లో 139 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.