తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు

కటక్​ వేదికగా విండీస్​తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్​లో 9 పరుగుల వద్ద.. శ్రీలంక మాజీ క్రికెటర్​ సనత్​ జయసూర్య 22 ఏళ్ల రికార్డును బ్రేక్​ చేశాడు. ఒక క్యాలెండర్​ ఇయర్​లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్​గా కొత్త అధ్యాయం లిఖించాడు.

By

Published : Dec 22, 2019, 7:35 PM IST

Rohit Sharma breaks Sanath jayasuriya
కింగ్​ 2019: రోహిత్​ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు

ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. మంచి ఫామ్​లో ఉన్న హిట్​మ్యాన్​.. కటక్​ వేదికగా విండీస్​తో జరుగుతున్న చివరి వన్డేలో మరో ప్రపంచ రికార్డు సాధించాడు. శ్రీలంక దిగ్గజ ఓపెనర్​ సనత్​ జయసూర్య నమోదు చేసిన ఓ రికార్డును 22 ఏళ్ల తర్వాత బ్రేక్​ చేశాడు రోహిత్​. ఒక క్యాలెండర్​ ఇయర్​లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్​గా కొత్త అధ్యాయం లిఖించాడు.

9 పరుగుల్లోనే...

జులైలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో జోరు చూపించిన రోహిత్ శర్మ ఆ తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ.. తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో శతకం సాధించాడు. ఈరోజు కటక్​లో ఆఖరి వన్డేలో 63 పరుగులు చేసిన హిట్​మ్యాన్​.. ఈ ఏడాది ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 2,442 రన్స్​ చేశాడు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

శ్రీలంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య 1997లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 2,387 పరుగులు చేయగా.. అప్పటి నుంచి ఈ రికార్డ్‌ను ఏ క్రికెటర్ అందుకోలేకపోయాడు. కానీ ఈ ఏడాది కెరీర్‌లోనే బెస్ట్ ఫామ్‌లో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.

ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా నెం.1 స్థానంలో ఉన్నాడు రోహిత్​.

ABOUT THE AUTHOR

...view details