టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ తన సతీమణి రితికా సజ్దెకు ఓ ప్రేమ సందేశం పంపించాడు. డిసెంబర్ 13న వీరి పెళ్లిరోజు సందర్భంగా ఆ జంటనాలుగోవివాహ వార్షికోత్సవం జరుపుకొంది. ఈ సందర్భంగా "నువ్వు లేకుండా నా జీవితం ముందుకు సాగుతుందని ఊహించలేను. ఇంతకన్నా మెరుగ్గా ఇంకేమీ ఉండదు. ఐ లవ్యూ రితికా సజ్దె" అని రోహిత్ ట్వీట్ చేశాడు. దానికి లవ్ ఎమోజీలను జత చేశాడు. తమ పెళ్లిరోజు చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
ఈ నావను నడిపిస్తున్న చుక్కాని నువ్వే - రోహిత్ శర్మ, రితిక వివాహ వార్షికోత్సవం
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన భార్య రితికపై ప్రేమను మరోసారి చాటుకున్నాడు. నేడు(శుక్రవారం) వీరిద్దరి నాలుగో వివాహ వార్షికోత్సవాన్నిపురస్కరించుకుని రోహిత్ పెళ్లినాటి ఫొటో షేర్ చేసి భావోద్వేగ సందేశాన్ని షేర్ చేశాడు.
రోహిత్, రితిక దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్నారు. 2015లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాదే ఈ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. తన గారాల పట్టి సమైరాతో హిట్‌మ్యాన్ ఆడుకుంటూ చాలాసార్లు కనిపించాడు. అంతేకాదు పాప ఎక్కడ తన దగ్గరికి రాదోనని గడ్డం మొత్తం తీసేసిన సంగతి ఇటీవలే వెల్లడించాడు.
పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు రోహిత్‌కు అభినందనలు తెలియజేశారు."మీ ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు", "మీ ఇద్దరూ ప్రేమ, నవ్వులను కలకలం పంచుకోవాలని కోరుకుంటున్నాం", "ఓహ్.. ఎంత బాగుందో జంట" అని ట్వీట్లు చేశారు. 2019 ఏడాది రోహిత్‌కు బాగా కలిసొచ్చింది. ముంబయి ఇండియన్స్‌కు సారథ్యం వహిస్తోన్న రోహిత్ ఐపీఎల్ ట్రోఫీని నాలుగో సారి గెలిచాడు. ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదేశాడు. టెస్టుల్లోనూ ఓపెనర్‌గా రాణించాడు.