తెలంగాణ

telangana

ETV Bharat / sports

400 సిక్స్​లతో రోహిత్ శర్మ రికార్డు - 400 సిక్స్​లతో రోహిత్ శర్మ రికార్డు

రోహిత్​ శర్మ.. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్​లో 400 సిక్స్​లు కొట్టిన క్రికెటర్​గా నిలిచాడు. వెస్టిండీస్​తో మూడో టీ20లో ఈ ఘనత సాధించాడు.

400 సిక్స్​లతో రోహిత్ శర్మ రికార్డు
రోహిత్ శర్మ

By

Published : Dec 11, 2019, 8:13 PM IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్​లో మిడ్ వికెట్ దిశగా సిక్స్ బాదిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ క్రిస్‌గేల్, అఫ్రిది మాత్రమే ఈ 400 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నారు.

400 సిక్స్​లతో రోహిత్ శర్మ రికార్డు

ఈ మ్యాచ్​లో 71 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఔటయ్యాడు. సుదీర్ఘ కెరీర్‌లో 218 వన్డేలాడిన రోహిత్ శర్మ 236 సిక్సర్లు, 104 టీ20ల్లో 116 సిక్సర్లు, 32 టెస్టుల్లో 52 సిక్సర్లు నమోదు చేశాడు.

భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ 359 సిక్సర్లు (538 మ్యాచ్‌లు), సచిన్ తెందూల్కర్ 264 సిక్సర్లు (664 మ్యాచ్‌ల్లో) టాప్ -3లో కొనసాగుతున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 398 మ్యాచ్‌ల్లో 206 సిక్సర్లతో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details