తెలంగాణ

telangana

By

Published : Jan 17, 2020, 7:36 PM IST

ETV Bharat / sports

సచిన్, గంగూలీ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

భారత బ్యాట్స్​మన్​ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వేగంగా 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఓపెనర్​గా రికార్డు సృష్టించాడు.

Rohit seven thousand runs in odi
రోహిత్ శర్మ

టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ.. వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి అత్యంత వేగంగా ఏడువేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌(42; 44 బంతుల్లో 6x4) అర్ధ శతకం చేజార్చుకున్నాడు. తద్వారా 137 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అతడి కంటే ముందు ఈ జాబితాలో హషీమ్‌ ఆమ్లా(147), సచిన్‌ తెందూల్కర్‌(160), తిలకరత్నే దిల్షాన్‌(165), సౌరభ్‌ గంగూలీ(168) ఉన్నారు.

గతేడాది ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో చెలరేగిన రోహిత్‌.. 2019కి గానూ వన్డే ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచాడు. గతేడాది మొత్తంగా 28 మ్యాచ్‌లాడిన రోహిత్‌ 57.30 సగటుతో 1409 పరుగులు చేశాడు. టీమిండియా వరుస విజయాలతో చెలరేగింది.

మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌.. 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం చెందింది.

ఇదీ చదవండి: ధావన్, కోహ్లీ, రాహుల్ విధ్వంసం.. ఆసీస్ లక్ష్యం 341

ABOUT THE AUTHOR

...view details