తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ ఖాతాలో మరో రికార్డు - world cup

ఆస్ట్రేలియాపై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా నిలిచాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. అతి తక్కువ ఇన్నింగ్స్​ల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ధావన్- రోహిత్ ఓపెనింగ్ వికెట్​కు 16వ శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

రోహిత్

By

Published : Jun 9, 2019, 7:36 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో హిట్​మ్యాన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. కంగారూ జట్టుపై 2 వేల పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. భారత్ తరఫున రెండో ఆటగాడు. సచిన్ 3 వేల 77 పరుగులతో అందరికంటే ముందున్నాడు.

కేవలం 37 ఇన్నింగ్స్​ల్లో ఆసీస్​పై 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రోహిత్​ రికార్డు సృష్టించాడు. సచిన్ ఈ ఘనత కోసం 40 మ్యాచ్​లు తీసుకున్నాడు.

ధావన్-రోహిత్ శతక భాగస్వామ్యం

రోహిత్-ధావన్
భారత ఓపెనర్లు రోహిత్-ధావన్ ఓపెనింగ్ వికెట్​కు 16వ సారి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి అత్యధిక సార్లు శతక భాగస్వామ్యాలు నమోదు చేసి రెండో జోడీగా నిలిచిన గిల్​క్రిస్ట్-హెడెన్ రికార్డును సమం చేశారు. ఈ జోడీ కూడా 16 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు సాధించింది. సచిన్-గంగూలీ జోడీ ఇరవైఒక శతక భాగస్వామ్యాలతో మొదటి స్థానంలో ఉంది.

మొదటి వికెట్​కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు రోహిత్-ధావన్. ప్రపంచకప్​లో ఆసీస్​పై భారత్​కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.

ఇవీ చూడండి.. గ్లౌజ్​ దుమారంపై ధోనికి వీరేంద్రుడి సలహా

ABOUT THE AUTHOR

...view details