తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించే సత్తా అతడికే ఉంది'

ప్రస్తుత క్రికెటర్లలో టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించడం ఒకే ఒక్క ఆటగాడికి సాధ్యమవుతుందన్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్. అతడెవరో కాదు టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ. అతడు బంతిని బాదే నైపుణ్యం అద్భుతంగా ఉంటుందని కొనియాడాడు.

హాగ్
హాగ్

By

Published : Mar 17, 2020, 6:50 AM IST

టీ20ల్లో సెంచరీ చేయడానికే క్రికెటర్లు శ్రమిస్తుంటారు. అలాంటిది డబుల్ సెంచరీ చేయాలంటే ఎలా. కానీ ఆ ఘనత ఓ క్రికెటర్​కు సాధ్యమవుతుందని చెబుతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్. ఆ ఘనత సాధించే వీలున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.

"ఇప్పుడున్న క్రికెటర్లలో రోహిత్ శర్మకు మాత్రమే టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించే సత్తా ఉంది. బంతిని టైమింగ్​తో బాదడం, మంచి స్ట్రయిక్ రేట్, మైదానం నలువైపులా సిక్సులు కొట్టగల సామర్థ్యం అతడి సొంతం."

-బ్రాడ్ హాగ్, ఆస్ట్రేలియా స్పిన్నర్

సెప్టెంబర్ 2007లో డర్బన్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​తో రోహిత్ శర్మ టీ20 అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 94 టీ20లు ఆడిన హిట్​మ్యాన్ 137.68 స్ట్రయిక్ రేట్​తో 2,331 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధంచిన ఏకైక క్రికెటర్​గా రికార్డులకెక్కాడు రోహిత్. వన్డేల్లో అత్యధిక స్కోర్ 264 ఇతడి పేరిటే ఉంది.

రోహిత్ శర్మ

2018లో జింబాబ్వేతో జరిగిన టీ20లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. డబుల్ సెంచరీకి చాలా సమీపంగా వచ్చినా ఆ ఘనతను సాధించలేకపోయాడు.

ఐపీఎల్ -2013లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు క్రిస్ గేల్ 66 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఓవరాల్ టీ20ల్లో ఇదే ఇప్పటివరకు అత్యధికం.

ABOUT THE AUTHOR

...view details