తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్​ క్రీజులో అరగంట ఉంటే చాలు' - rohit sharma latest news updates

ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్​లో రోహిత్ శర్మ​ తప్పనిసరిగా విజయం సాధిస్తాడని ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ నాసర్​ హుస్సేన్​ తెలిపారు. అయితే, తొలి అరగంట రోహిత్​ క్రీజులో ఉంటే చాలని అన్నారు.

Rohit only needs to see out first half hour in Australia to be successful: Nasser Hussain
'రోహిత్​ క్రీజులో అరగంట గడిపితే చాలు'

By

Published : Jun 20, 2020, 9:51 AM IST

భారత క్రికెటర్ రోహిత్​ శర్మ బ్యాటింగ్​ ప్రదర్శనపై ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్ నాసర్​ హుస్సేన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్​లో రోహిత్​ కచ్చితంగా విజయవంతమవుతాడని, అయితే అతడు తొలి అరగంట క్రీజులో గడపాలని హుస్సేన్‌ అన్నారు.

నాసర్​ హుస్సేన్​

"టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ ఓపెనర్‌ కాకపోతే నేను వేరే ఆట చూస్తుంటా. మీ అభిమాన ఆటగాడు ఎవరని తోటి క్రికెటర్లను అడిగితే అత్యధికులు రోహిత్‌ పేరే చెబుతారు. తోటి ఆటగాళ్లంతా అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తారు. షాట్లు ఆడేందుకు రోహిత్‌ దగ్గర చాలా సమయం ఉంటుందని వాళ్లు అంటారు."

నాసర్​ హుస్సేన్​, ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​

వన్డేల్లో గొప్ప ఆటగాడిగా నిరూపించుకున్న రోహిత్‌.. టెస్టుల్లో ఇంకా స్థాయికి తగ్గ ఆట ప్రదర్శించలేదు. "విదేశీ పర్యటనలో విజయవంతమవడానికి రోహిత్‌ చేయాల్సింది ఒక్కటే. అరగంట పాటు క్రీజులో గడపాలి. ఈ అరగంట నిన్ను వదిలేస్తున్నానని బౌలర్‌కు చెప్పేయాలి" అని నాసర్‌ తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details