వన్డేల్లో అత్యుత్తమ ఓపెనర్లలో టీమ్ఇండియా స్టైలిష్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ కూడా ఒకరని మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రోహిత్ సెంచరీలు చేసే నైపుణ్యం అద్భుతమంటూ కితాబిచ్చారు.
టీమ్ఇండియా తరఫున ఒకప్పుడు ఓపెనర్‌గా ఉన్న శ్రీకాంత్.. అత్యుత్తమ ఓపెనర్ల జాబితాలో రోహిత్ టాప్3, టాప్ 5 స్థానాల్లో ఉంటాడని అభిప్రాయపడ్డారు.
"అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప ఆల్ టైమ్ ఓపెనర్లలో ఒకరిగా రోహిత్‌కు మద్దతిస్తా. శతకాలు, డబుల్ సెంచరీలు సాధించేందుకు అతని పోరాటం అద్భుతం. వన్డే మ్యాచ్‌ల్లో మీరు 150, 180, 200 వరకు స్కోరు సాధిస్తుంటే.. మీ జట్టును ఎక్కడి వరకు తీసుకెళ్లనున్నారో ఓ సారి ఊహించుకోండి. అదే రోహిత్లో ఉన్న గొప్పతనం."