తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ స్థానంలో కెప్టెన్​గా అతడే సరైనోడు: ఇర్ఫాన్

కోహ్లీ గైర్హాజరీ అయ్యే ఆసీస్​తో టెస్టు​ సిరీస్​కు రోహిత్​ను కెప్టెన్​గా నియమించాలని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జట్టును నడిపించగల సమర్థవంతమైన నాయకుడిగా హిట్​మ్యాన్ ఇప్పటికే నిరూపించుకున్నాడని అన్నాడు.

Rohit
రోహిత్​

By

Published : Nov 10, 2020, 10:32 AM IST

ఆస్ట్రేలియాతో సిరీస్​కు తాత్కాలిక సారథిగా రోహిత్​ శర్మను ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​. ఆ స్థానానికి అతడే అర్హుడని అన్నాడు. టెస్టు​ సిరీస్​లోని చివరి మూడు మ్యాచ్​లకు సారథి విరాట్ దూరమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్​

"టెస్టు​ సిరీస్​కు విరాట్​ కోహ్లీ దూరమవ్వడం జట్టుపై పెద్ద ప్రభావం చూపొచ్చు. కానీ అతడి నిర్ణయాన్ని గౌరవించాలి. ఎందుకంటే క్రికెట్​ కన్నా కుటంబం ఎంతో ముఖ్యమన్న విషయాన్ని మనం అంగీకరించాలి. కానీ మైదానంలో విరాట్​ స్థానం భర్తీ చేయడం చాలా కష్టం. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు రాణించినా విధానమే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఆ స్థానాన్ని రహానెకు బదులు రోహిత్​కు ఇవ్వాలని నా అభిప్రాయం. ఎందుకంటే అతడూ సమర్థవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నాడు. ఎంతో అనుభవముంది. ఓపెనర్​గా అతడి పాత్ర ఎంతో కీలకం. రోహిత్ కెరీర్​ ప్రారంభించిన కొత్తలో 2008లో​ ఆస్ట్రేలియా పిచ్​లపై బాగా ఆడాడు. కాబట్టి తాత్కాలిక సారథిగా అతడైతేనే సరియైన వ్యక్తి"

-ఇర్ఫాన్​ పఠాన్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది. కాబట్టి విరాట్​ పితృత్వ సెలవులు తీసుకుని స్వదేశానికి రానున్నాడు. అప్పుడు తాత్కాలిక సారథిగా టెస్టు వైస్​ కెప్టెన్​ అజింక్యా రహానెకు నియమించే అవకాశముంది. కాబట్టి అతడికి బదులుగా రోహిత్​ను ఎంపిక చేయాలని సూచించాడు ఇర్ఫాన్​.

నవంబరు 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.

ఇదీ చూడండి : ఆసీస్​తో టెస్టులకు కోహ్లీ దూరం.. రోహిత్​కు అవకాశం

ABOUT THE AUTHOR

...view details