తెలంగాణ

telangana

ETV Bharat / sports

పింక్ టెస్టు: రోహిత్​కు లైఫ్.. భారత్ స్కోరు 35/1​ - rohit life

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న పింక్ టెస్టులో భారత్.. రెండో సెషన్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్, పుజారా ఉన్నారు.

By

Published : Nov 22, 2019, 6:04 PM IST

చారిత్రక డే/నైట్‌ టెస్టులో భారత్‌ నిలకడగా ఆడుతోంది. రెండో సెషన్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది టీమిండియా. బంగ్లా బౌలర్లు మంచి స్వింగ్ రాబడుతున్నారు. అల్‌ ఆమిన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన మయాంక్‌ అగర్వాల్‌ (14) మెహదీ చేతికి చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ (17*), ఛెతేశ్వర్‌ పుజారా(7*) ఉన్నారు.

హిట్ మ్యాన్ క్యాచ్జారవిడిచారు​..

అబు జాయేద్ వేసిన 11 ఓవర్ మొదటి బంతిని రోహిత్ ఫుల్​ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని బౌండరీ లైన్​లో ఉన్న అల్ ఆమిన్ చేజార్చాడు. ఫ్లడ్​ లైట్ల వెలుగులో పింక్ బంతి సరిగ్గా కనిపించట్లేదని ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ఫిర్యాదు చేశారు.

టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలింది. ఇషాంత్‌ శర్మ (5/22) ధాటికి బంగ్లా ఫ్లడ్‌లైట్లలో బ్యాటింగ్‌ చేయకుండానే చాపచుట్టేసింది. ప్రస్తుతం ఫ్లడ్‌లైట్లలో గులాబీ బంతితో భారత బ్యాట్స్‌మెన్‌ అసలైన పరీక్ష ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: నిప్పులు చెరిగిన ఇషాంత్.. బంగ్లా 106 ఆలౌట్​

ABOUT THE AUTHOR

...view details