బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడనున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో శుక్రవారం గాయపడిన హిట్ మ్యాన్ తనపై వస్తున్న అనుమానాలకు చెక్ పెట్టాడు. మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
"మెన్ ఇన్ బ్లూతో మళ్లీ కలవబోతున్నా. బంగ్లాతో మ్యాచ్‌కోసం ఎంతో ఆత్రుతతో ఉన్నా." - రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్.
నెట్లో సాధన చేస్తుండగా.. ఎడమ తొడకు బంతి తగిలి గాయపడ్డాడు రోహిత్. అయితే బీసీసీఐ వైద్యబృందం అతడిని పరిశీలించి ఫిట్‌గా ఉన్నాడని తెలిపింది. తొలి టీ20 ఆడగలడని ఖరారు చేసింది.
నవంబరు 3 నుంచి 10 వరకు బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చింది జట్టు యాజమాన్యం. అతడి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించింది.
ఇదీ చదవండి: 'టీ కప్పుల' వ్యాఖ్యలపై ఫరూక్ ఇంజినీర్ యూటర్న్