టీమ్‌ఇండియాలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ అని.. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో వాళ్లిద్దరే బరిలోకి దిగాలని.. మాజీ క్రికెటర్, సెలెక్టర్ శరన్‌దీప్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో టీమ్‌ఇండియా ఆటగాళ్లపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ధావన్ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. దీంతో జట్టు యాజమాన్యం తర్వాత ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా అవకాశమిచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతడు చక్కగా వినియోగించుకుని.. అందరిచేత ప్రశంసలు పొందాడు. మరోవైపు చివరి టీ20లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన కోహ్లీ దుమ్మురేపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ భవిష్యత్‌లోనూ తాను ఓపెనింగ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే శరన్‌దీప్ పలు విషయాలపై స్పందించాడు.
లెఫ్ట్ అండ్ రైట్ జోడీనే బెటర్..
"తొలి టీ20 తర్వాత ధావన్‌ను తొలగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటనల్లో బాగా ఆడాడు. మానసికంగా అతడెంతో దృఢంగా ఉంటాడు. ఎప్పుడు ఆడినా పరుగులు చేస్తాడు. అయితే, తొలి టీ20 తర్వాత టీమ్ఇండియా అతడిని పక్కన పెట్టి ఇతరులకు అవకాశం ఇవ్వాలని చూసిందేమో! కానీ, నా అభిప్రాయం ప్రకారం.. రోహిత్-ధావన్‌ల రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషనే అత్యుత్తమ జోడీ. టీ20 ప్రపంచకప్‌లో వాళ్లిద్దరే ఓపెనింగ్ చేయాలి. ఒక్క మ్యాచ్‌లో ఆడనంత మాత్రాన ధావన్‌ను అలా తొలగించడం సరికాదు. పొట్టి సిరీస్ తర్వాత వన్డేల్లో అతడు మంచి ప్రదర్శనే చేశాడు. కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నీయే టీమ్‌ఇండియా ప్రపంచకప్ జట్టును నిర్ణయిస్తుంది. అందులో చోటు దక్కాలంటే ఇషాన్ కిషన్ కూడా అత్యద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది" అని శరన్ పేర్కొన్నారు.
పంత్ స్థానానికి ఢోకా లేదు..