తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్విస్ ఓపెన్​ టైటిల్ పదోసారి గెలిచిన ఫెదరర్​

పదోసారి స్విస్ ఇండోర్ ఛాంపియన్​షిప్​ టైటిల్ కైవసం చేసుకున్నాడు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్​. ఫైనల్లో అలెక్స్ డి మినార్​పై 6-2, 6-2 తేడాతో సులభంగా గెలిచాడు.

ఫెదరర్​

By

Published : Oct 28, 2019, 12:18 PM IST

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ స్విస్‌ ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచాడు. ఫలితంగా కెరీర్‌లో పదోసారి ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బాసెల్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ డి మినార్‌పై 6-2, 6-2 తేడాతో విజయం సాధించాడు.

"ఈ ఆట త్వరగా పూర్తయినా చాలా బాగా సాగింది. నేను అత్యుత్తమంగా ఆడాననుకుంటున్నా. అలెక్స్‌ కూడా ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. మా ఆట పట్ల ఇద్దరం సంతోషంగానే ఉన్నామని భావిస్తున్నా. సొంతగడ్డపై పదోసారి ఈ టైటిల్‌ గెలుపొందడం నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది."
-ఫెదరర్​, టెన్నిస్ ఆటగాడు

ఈ విజయం​తో కెరీర్‌లో మొత్తం 103 సింగిల్స్‌ సాధించిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఫెదరర్​‌. ఇతడికి ఈ సీజన్‌లో ఇది నాలుగో టైటిల్‌ కావడం విశేషం. ఇంతకుముందు దుబాయ్‌, మియామి, హాలే టోర్నీల్లో విజేతగా నిలిచాడు.

ఇవీ చూడండి.. 'యాక్షన్​'తో అదరగొడుతున్న విశాల్..!

ABOUT THE AUTHOR

...view details