కరోనా వైరస్ సెగ మరో టోర్నీని తాకింది. సచిన్, బ్రియన్ లారా వంటి దిగ్గజాలు ఆడుతున్న రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ రద్దయింది. మహారాష్ట్రలో బుధవారం 10 కరోనా కేసులు నమోదైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్వహకులు.
"ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన మ్యాచులను రీషెడ్యూల్ చేసేందుకు నిర్వాహకులు అంగీకరించారు. స్టేడియంలో అభిమానులను అనుమతించే పరిస్థితులు ఏర్పడగానే మ్యాచులు నిర్వహిస్తాం"