టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి స్నేహితులు ఎక్కువే. డివిలియర్స్, కోహ్లీ మంచి ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్, డివిలియర్స్‌తో దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు విరాట్. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
"క్రీడల్లో ఉన్న ఓ అందమైన విషయం ఏంటంటే, మైదానంలో ప్రత్యర్థులుగా ఉంటారు. ఒక చిరునవ్వు అథ్లెట్ల మధ్యలో అన్ని ఉద్రిక్తతలను తగ్గిస్తుంది. మైదానంలో కష్టపడి ఆడాలి.. అలాగే, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆట ద్వారా ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులను కలుసుకోవడం గొప్ప వరం"
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి