తెలంగాణ

telangana

ETV Bharat / sports

'తొలి టెస్టులో సాహా కాదు పంత్​ ఆడతాడు' - కోహ్లీ పంత్​ ఇంగ్లాండ్​ తొలి టెస్టు

ఇంగ్లాండ్​తో జరగబోయే తొలి టెస్టులో సాహాను పక్కనపెట్టి పంత్​ను తీసుకున్నట్లు తెలిపాడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​తో అతడు మంచి ఫామ్​లోకి రావడమే ఇందుకు కారణమని చెప్పాడు. అతడు ఆట కోసం బాగా కష్టపడుతున్నాడని ప్రశంసించాడు.

panth
పంత్​

By

Published : Feb 4, 2021, 5:38 PM IST

Updated : Feb 4, 2021, 7:22 PM IST

టెస్టుల్లో కీపర్​‌ స్థానం కోసం యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహాల మధ్య చాలాకాలం నుంచి గట్టి పోటీ నడుస్తోంది. అయితే తాజాగా ఇంగ్లాండ్​తో జరగబోయే తొలి టెస్టులో సాహా కన్నా పంత్​ను ఆడించడమే తమ తొలి ప్రాధాన్యం అని చెప్పాడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ. అతడే ఆడతాడని స్పష్టం చేశాడు.

"తొలి టెస్టులో పంత్ ఆడతాడు. అతడు మంచి ఫామ్​లో ఉన్నాడు. ఆట కోసం అన్ని విభాగాల్లోనూ బాగా కష్టపడుతున్నాడు. ​ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో అతడు అద్భుతంగా రాణించాడు. అతడు తన ఫామ్​ను అలానే కొనసాగించాలని ఆశిస్తున్నాను."

-కోహ్లీ, టీమ్​ఇండియా సారథి.

ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్​ కోసం తుదిజట్టు కూర్పు మేనేజ్​మెంట్​కు తలనొప్పిగా తయారైంది. బౌలింగ్ విషయానికొస్తే ఎవరిని తీసుకోవాలనే విషయంలో సందిగ్ధంలో పడింది బోర్డు. ఈ విషయమై మాట్లాడిన విరాట్​.. ఇకపై అన్ని మ్యాచులకు దాదాపుగా బ్యాటింగ్​ చేయగలిగే బౌలర్లను తీసుకోవడమే తొలి ప్రాధాన్యం అని చెప్పాడు. తాను గౌర్హాజరీ సమయంలో తాత్కాలిక సారథిగా వ్యవహరించిన అజింక్యా రహానెను ప్రశంసించాడు. జట్టును సమర్థవంతగా ముందుకు నడిపించాడని అన్నాడు. తామిద్దరు మధ్య మంచి స్నేహబంధం ఉందని వెల్లడించాడు.

ప్రస్తుతం భారత్​ పర్యటనలో భాగంగా చెన్నైలో ఉంది ఇంగ్లాండ్​. ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, మూడు(డేనైట్), నాలుగో మ్యాచ్​కు అహ్మదాబాద్ (మొతేరా స్టేడియం) వేదిక కానుంది.

ఇదీ చూడండి: రైతు ఉద్యమంపై టీమ్​ఇండియాతో సారథి కోహ్లీ చర్చ

Last Updated : Feb 4, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details