టీవీ నటి ఇషా నేగీతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్. "నీతో ఉన్నప్పుడు.. నన్ను నేను బాగా ఇష్టపడుతున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ ఫొటోలో కలర్ఫుర్గా కనిపిస్తూ నెటిజన్ల మనసు దోచుకున్నారు వీరిద్దరూ.
ప్రస్తుతం పంత్, ఇషా విహార యాత్రల్లో మునిగి తేలుతున్నారు. క్రిస్ట్‌మస్, న్యూఇయర్ వేడుకల్లో భాగంగా మరోసారి వీరిద్దరి ప్రేమాయణం హాట్ టాపిక్‌గా మారింది. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని గర్ల్‌ఫ్రెండ్ ఇషాతో గడపడానికి కేటాయించాడు పంత్.