తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్​కు ఇంకా స్థిరత్వం అవసరం: గంభీర్ - Rishabh Pant needs to be more consistent with the bat: Gautam Gambhir

యువ వికెట్​ కీపర్ రిషభ్ పంత్.. స్థిరంగా ఆడటం ఇంకా నేర్చుకోవాలన్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. 60, 70 పరుగులను శతకాలుగా మార్చడం అలవాటు చేసుకోవాలని చెప్పాడు

Rishabh Pant needs to be more consistent with the bat: Gautam Gambhir
పంత్ - గంభీర్

By

Published : Dec 17, 2019, 2:13 PM IST

కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత యువ వికెట్​కీపర్ రిషభ్ పంత్.. వెస్టిండీస్​తో తొలి వన్డేలో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ విషయమై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. 69 బంతుల్లో 71 పరుగులు చేసిన పంత్.. వాటిని శతకాలుగా మారుస్తూ, స్థిరంగా ఆడాలని సూచించాడు.

"అతడు(పంత్) ఇంకా స్థిరంగా ఆడాల్సిన అవరముంది. 60, 70 పరుగులను శతకాలుగా మార్చడం నేర్చుకోవాలి. మహీ ఈ స్థిరత్వమే అలవర్చుకున్నాడు. అతడు(పంత్) భారీ శతకాలు చేయనప్పటికీ చివరి వరకు క్రీజులో ఉండాలి. పంత్.. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు. టెస్టు క్రికెట్​ తుది జట్టులో లేకపోయినప్పటికీ.. 15 మంది సభ్యుల్లో ఉన్నాడు. దీన్ని బట్టి, యాజమాన్యం అతడిపై ఎంత నమ్మకం పెట్టుకుందో తెలుస్తుంది" - గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ క్రికెటర్

విండీస్​తో మ్యాచ్​లో అర్ధశతకంతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్.. ఇలాంటి అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడని గంభీర్ అన్నాడు. అతడు కూడా ఈ 60, 70 పరుగులను శతాకాలుగా మారిస్తే బలమైన మిడిల్ ఆర్డర్​ బ్యాట్స్​మన్​గా తయారవుతాడని చెప్పాడు.

ఇదీ చదవండి: ఐసీసీ వన్డే, టీ20 జట్లలో స్మృతి మంధాన

ABOUT THE AUTHOR

...view details