తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్​పై వేటు.. సఫారీతో తొలి టెస్టుకు సాహా - ind vs sa

దక్షిణాఫ్రికాతో బుధవారం ప్రారంభంకానున్న తొలి టెస్టులో పంత్ ఛాన్స్​ కోల్పోయాడు. అతడి స్థానంలో సాహాకు అవకాశమిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. రోహిత్​ ఓపెనర్​గా బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేశాడు విరాట్​.

పంత్

By

Published : Oct 1, 2019, 1:08 PM IST

Updated : Oct 2, 2019, 5:56 PM IST

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. రేపు (బుధవారం) విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్​ జరగనుంది. ప్రాక్టీస్​లో బిజీగా ఉన్న కోహ్లీసేన... సఫారీలపై గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జట్టులో మార్పులు చేసింది యాజమాన్యం. తుది జాబితాలో యువవికెట్ కీపర్​ రిషబ్​ పంత్​కు బదులుగా వృద్ధిమాన్​ సాహాకు అవకాశం లభించింది. దీనిపై తాజాగా స్పందించిన కోహ్లీ... మొదటి టెస్టులో సాహా ఆడతాడని స్పష్టం చేశాడు.

ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​లో ఘోరంగా విఫలమయ్యాడు పంత్. రెండు మ్యాచ్​ల్లో వరుసగా 4, 19 పరుగులు చేసి నిరాశపర్చాడు. గత నెలలో జరిగిన వెస్టిండీస్​ టెస్టు సిరీస్​లోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు.

అనుభవమున్న జడేజా, అశ్విన్​లు మొదటి టెస్టులో బరిలోకి దిగుతారని కోహ్లీ తెలిపాడు. స్టార్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ ఓపెనర్​గా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని అన్నాడు.

తుది జట్టు....

విరాట్​ కోహ్లీ(సారథి), అజింక్య రహానే(ఉప సారథి), రోహిత్​ శర్మ, మయాంక్​ అగర్వాల్​, చతేశ్వర్​ పుజారా, హనుమ విహారి, ఆర్​ అశ్విన్​, ఆర్​ జడేజా, వృద్ధిమాన్​ సాహా(కీపర్​), ఇషాంత్​ శర్మ, మహ్మద్​ షమి

ఇవీ చూడండి.. కోహ్లీని అధిగమించిన పాక్ క్రికెటర్

Last Updated : Oct 2, 2019, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details