ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చినప్పటి నుంచి తనని ఓ విషయంలో ఇంట్లోవాళ్లు తొందరపెడుతున్నారని టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మెన్ రిషభ్‌పంత్ తెలిపాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ చారిత్రక విజయం సాధించడంలో పంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు గతవారం తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు.
'నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి.. ఇప్పుడైనా కొత్త ఇల్లు తీసుకోమని మా ఇంట్లోవాళ్లు వెంటపడుతున్నారు. అందుకోసం గురుగ్రామ్ బాగుంటుందా? లేదా వేరే ఏదైనా మంచి ప్రదేశం ఉంటే చెప్పండి' అని అభిమానులను అడిగాడు. కాగా, పంత్ పోస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముంబయి, నోయిడా, కాన్పూర్, ముజఫర్‌నగర్ ఇలా అనేక ప్రదేశాలు బాగున్నాయని అభిమానుల నుంచి కామెంట్లు వచ్చాయి.