భారత్ x ఆస్ట్రేలియా రెండో టెస్టులో పలువురు ఆటగాళ్లు సరికొత్త రికార్డుల్ని నమోదు చేశారు. రెండో రోజు ఆడుతూ ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, పేసర్ స్టార్క్, భారత వికెట్ కీపర్ పంత్.. ఈ ఘనతల్ని సాధించారు.
పంత్ వరుసగా ఎనిమిదిసార్లు
ఆస్ట్రేలియాపై ఆ దేశంలో టెస్టుల్లో వరుసగా ఎనిమిది సార్లు 25 పరుగులకు పైగా స్కోరు చేసిన వాడిగా పంత్ తొలిస్థానంలో నిలిచాడు. దీంతో వాలీ హమ్మాండ్, రుషి సుర్టీ, వివ్ రిచర్డ్స్ సరసన పంత్ చోటు దక్కించుకున్నాడు.
250 వికెట్లు తీసిన స్టార్క్
టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 250 వికెట్లు తీసిన ఆసీస్ తొలి బౌలర్‌గా మిచెల్ స్టార్క్ ఘనత సాధించాడు. ఈ మార్క్‌ను అందుకోవడానికి 11976 బంతుల్ని స్టార్క్ వేశాడు. తర్వాతి స్థానాల్లో మిచెల్ జాన్సన్(12578 బంతులు), డెన్నిస్ లిల్లీ(12722), బ్రెట్ లీ(12961), మెక్‌గ్రాత్(13015) ఉన్నారు.
ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలి వికెట్ కీపర్ పైన్
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ పంత్ క్యాచ్ అందుకున్న ఆసీస్ వికెట్ కీపర్ పైన్.. 33 మ్యాచ్‌ల్లో 150 ఔట్లలో భాగస్వామిగా నిలిచాడు. అందరికంటే ఈ జాబితాలో ఇతడే ముందున్నాడు. తర్వాత డికాక్(34 మ్యాచ్‌లు), గిల్‌క్రిస్ట్(36), బౌచర్(38), మార్ష్(39) ఉన్నారు.
ఇది చదవండి:నాన్న కల నెరవేర్చిన వేళ.. సిరాజ్ అదరహో!