తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సరైన సారథి.. సమర్థమంతమైన జట్టు' - వీవీఎస్ లక్ష్మణ్

లోక్​సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన భాజపా, ప్రధాని నరేంద్ర మోదీకి... ట్విట్టర్​ వేదికగా టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు.

'సరైన సారథి.. సమర్ధమంతమైన జట్టు'

By

Published : May 23, 2019, 7:45 PM IST

2019 లోక్​సభ ఎన్నికల్లో భాజపా విజయదుందుబి మోగించింది. దేశమంతా కాషాయ పవనాలు వీచిన నేపథ్యంలో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు చెపుతున్నారు. ఈ జాబితాలోకి భారత క్రికెటర్లు చేరారు. ట్విట్టర్​ వేదికగా వినూత్నంగా స్పందిస్తున్నారు.

"సరైన సారథి, సమర్థమంతమైన జట్టు, సరైన దిశలో బలమైన పేస్ బౌలింగ్ వేశారు." -పార్థివ్ పటేల్

"భారతదేశం గెలిచింది. ఈ విజయానికి కారణమైన మోదీకి శుభాకాంక్షలు. ప్రగతిని కొనసాగించుతూ రెండో ఇన్నింగ్స్ మరింత బాగా ఆడాలని కోరుకుంటున్నాను." - వీరేంద్ర సెహ్వాగ్

"అందరి నమ్మకాన్ని నిలబెడుతూ మోదీ గెలిచారు. మా అందరికీ మరింతగా దిశానిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను" -రవీంద్ర జడేజా

ABOUT THE AUTHOR

...view details