దిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ తెలిపాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసులో అద్భుత ప్రదర్శన చేసిన పంత్, అక్షర్ పటేల్, అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు. వీరు ముగ్గురు ఐపీఎల్లో దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా షెడ్యూల్‌ను పాలక మండలి ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్ 9న మొదలవుతున్న పొట్టి క్రికెట్ వేడుక మే 30న ముగియనుంది. ఈసారి లీగ్ భారత్‌లోనే జరుగుతుంది. ఆరు తటస్థ వేదికల్లో మ్యాచులు నిర్వహిస్తారు. కాగా, దిల్లీ క్యాపిటల్స్ సభ్యులైన రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తాజా సిరీస్‌ల్లో అద్భుత ప్రదర్శన చేశారు.