తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాంటింగ్​పై అభిమానుల ఆగ్రహం.. టెస్టు జట్టుపై అసంతృప్తి - Fans Fire On Ponting

ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రకటించిన ఈ దశాబ్దపు టెస్టు జట్టుపై క్రికెట్ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 11 మందిలో ఏడుగురు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఉన్నారని మండిపడుతున్నారు.

Ricky Ponting Picks Virat Kohli Captain Of His Test Team Of The Decade But Fans Still Unhappy. Here's Why
పాంటింగ్

By

Published : Dec 30, 2019, 4:59 PM IST

Updated : Dec 30, 2019, 6:34 PM IST

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించాడు. ఇందులో కెప్టెన్​గా విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్​గా కుమార్ సంగక్కరతో పాటు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్స్​న్ లాంటి మేటి బ్యాట్స్​మెన్​కు చోటు కల్పించాడు. కెప్టెన్​గా కోహ్లీని ఉంచినా, పాంటింగ్​పై మండిపడుతున్నారు అభిమానులు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

11 మందిలో ఏడుగురు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు చెందిన వారినే తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచ అగ్ర జట్టయిన టీమిండియా నుంచి ఒక్కరినే ఎంపిక చేయడం ఏంటని ఒకరు ట్వీట్ చేయగా.. అండర్సన్, బ్రాడ్ లాంటి బౌలర్లు ఉపఖండపు పిచ్​ల్లో సత్తాచాటలేదని మరొకరు పోస్టు చేశారు. అశ్విన్​ను కాదని లియోన్​ను ఎంపిక చేయడమేంటని మరొకరు స్పందించారు.

రికీ పాంటింగ్ టెస్టు జట్టు

విరాట్ కోహ్లీ(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఆలిస్టర్ కుక్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, సంగక్కర(కీపర్), బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, నాథన్ లియోన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.

ఇదీ చదవండి: టెస్టు ర్యాంకింగ్స్​: అగ్రస్థానంతో ఏడాదిని ముగించిన కోహ్లీ

Last Updated : Dec 30, 2019, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details