తలచుకుంటే కోట్లలో లావాదేవీలు జరిపే స్థాయి అతడికి ఉంది. ఆస్తితో పాటు పేరు ప్రఖ్యాతలు వారసత్వంగా వచ్చినా, తండ్రి శ్రీమంతుడైనా, నచ్చిన దారిలో వెళుతూ, తనదైన ముద్ర వేయాలని అనుక్షణం తపన పడుతున్నాడు భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా.
తండ్రి చేస్తున్న వ్యాపారంలో చేరకుండా కొన్ని భిన్నమైన ప్రణాళికలు ఏర్పరచుకున్నాడు ఆర్యమాన్. చిన్న వయసు నుంచే క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఆ వైపుగా అడుగులు వేశాడు.
"నా పేరు కారణంగా ఒత్తిడి ఉంటుందని అందరూ అనుకోవచ్చు. కానీ అది నాకిష్టమైన మార్గాన్ని నిర్మించుకోవటానికి ఉపయోగపడుతుంది. మైదానంలో ఆడుతున్నప్పుడు మాత్రం బంతిపైనే దృష్టి ఉండాలి. అది నా బాధ్యత. దాన్ని ముందుకు తీసుకెళ్లడానికే నేను ఇష్టపడతాను"
- ఆర్యమాన్ బిర్లా, భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్