తెలంగాణ

telangana

ETV Bharat / sports

మణిపూర్ బౌలర్ రికార్డు ప్రదర్శన.. 22 పరుగులకే 8వికెట్లు

సోమవారం ప్రారంభమైన రంజీట్రోఫీలో మణిపుర్ బౌలర్ రెక్స్ సింగ్ మిజోరాంతో మ్యాచ్​లో 8 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఆ జట్టు 65 పరుగులకు ఆలౌటైంది.

By

Published : Dec 9, 2019, 9:31 PM IST

Rex's 8 for 22 puts Manipur in strong position against Mizoram
రెక్స్ సింగ్

రంజీ ట్రోఫీ మొదలైన తొలిరోజే మణిపుర్ బౌలర్ రెక్స్ సింగ్ అదరగొట్టాడు. మిజోరాంతో జరుగుతున్న మ్యాచ్​లో 22 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఫలితంగా మిజోరాం జట్టు 65 పరుగులకు ఆలౌటైంది. తరువార్ కోహ్లీ(34) ఒక్కడిదే అత్యుత్తమ స్కోరు .

రెక్స్ సింగ్ ధాటికి కేవలం 16 ఓవర్లలోనే మిజోరాం జట్టు ఆలౌటైంది. ఆరుగురు బ్యాట్స్​మెన్ డకౌట్​గా వెనుదిరిగారు. కేవలం ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును అందుకున్నారు. గత డిసెంబరులో జరిగిన కూచ్ ట్రోపీలో 10 వికెట్లు తీసి అందరిని ఆకర్షించాడు రెక్స్ సింగ్.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన మణిపుర్ జట్టు.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ప్రస్తుతం 190 పరుగుల ఆధిక్యంలో ఉంది మణిపుర్. ఓపెనర్ చింగాంబామ్ సింగ్(89), రెక్స్ సింగ్(58) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. మిజోరాం బౌలర్లలో బాబీ జోతాన్​సంగా 4 వికెట్లు తీశాడు.

బౌలింగ్​లో 8 వికెట్లుతో రాణించిన రెక్స్ సింగ్ బ్యాటింగ్​లోనూ ఆకట్టుకున్నాడు. 66 బంతుల్లో 58 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇందులో 7 ఫోర్లు ఓ సిక్సర్ ఉంది.

ఇదీ చదవండి: 150 రంజీ మ్యాచ్​లతో వసీం జాఫర్ రికార్డు

ABOUT THE AUTHOR

...view details