తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: క్రికెటర్లందరూ యూఏఈ వెళ్లేది అప్పుడే

యూఏఈ వెళ్లి ముందే ప్రాక్టీసు మొదలుపెట్టాలని భావించిన ఐపీఎల్​ జట్ల ఆలోచనకు పాలకమండలి అడ్డుకట్ట వేసింది. ఆగస్టు 20 తర్వాతే అక్కడికి చేరుకోవాలని స్పష్టం చేసింది.

ఐపీఎల్: క్రికెటర్లందరూ యూఏఈ వెళ్లేది అప్పుడే
ఐపీఎల్ క్రికెటర్లు

By

Published : Aug 3, 2020, 11:02 AM IST

ఐపీఎల్​ పాలకమండలి భేటీ జరిగిన తర్వాత టోర్నీపై పూర్తి స్పష్టత వచ్చింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు మ్యాచ్​లు ఉంటాయని స్పష్టం చేసింది. అన్ని జట్లు, ఆగస్టు 20 తర్వాతే ఆతిథ్య దేశానికి వెళ్లాలని మెయిల్స్ పంపింది. ఈ విషయాన్ని ఓ ఫ్రాంచైజీ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం వీసా ప్రక్రియ సాగుతుందని చెప్పారు.

యూఏఈ స్టేడియం

ఐపీఎల్ నిర్వహణ విషయమై మరో వారంలో కేంద్రం అనుమతి రానుంది. టోర్నీని పూర్తిగా బయో బబుల్ వాతావరణంలోనే జరపనున్నారు. అయితే క్రికెటర్ల కుటుంబాలకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే అంశాన్ని ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయి.

సోమవారం(ఆగస్టు 3).. ఐపీఎల్​ మ్యాచ్​ల పూర్తి షెడ్యూల్​ విడుదల కానుంది. ప్రతిజట్టులో గరిష్టంగా 24 మంది ఆటగాళ్లు ఉండనున్నారు.

ఐపీఎల్ విజేతల వివరాలు

ABOUT THE AUTHOR

...view details