తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో కొత్త జట్లు రెండు కాదు ఒక్కటే! - ఐపీఎల్​లో కొత్తగా ఒక్క జట్టు మాత్రమే

ఐపీఎల్​ 2022లో రెండు కొత్త జట్లను చేర్చాలన్న నిర్ణయాన్ని బీసీసీఐ మార్చుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఒక్క జట్టును మాత్రమే చేర్చాలని భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అందుకు కారణాలు ఇవే..

ipl
ఐపీఎల్

By

Published : Jan 18, 2021, 1:52 PM IST

ఐపీఎల్​-15వ సీజన్​లో మరో రెండు కొత్త జట్లను చేర్చాలని ఇటీవల బీసీసీఐ వార్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేవలం ఒక్క జట్టును మాత్రమే జత చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

రెండు జట్లు చేర్చితే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. అలాగే ఒక్క జట్టు మాత్రమే తీసుకురావడం వల్ల కొన్ని లాభాలు చేకూరే అవకాశమున్నాయని వెల్లడించాయి. అందుకే దీనిపై మరోసారి చర్చలు తాజా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి.

కారణాలు ఇవే..

  • ఒకేసారి రెండు జట్లకు బిడ్స్ వ‌ల్ల ప్ర‌స్తుత మార్కెట్ ప‌రిస్థితుల్లో భారీ మొత్తం వ‌చ్చే అవ‌కాశాలు లేవు. ప్ర‌స్తుతానికి ఒక జట్టుకు అవ‌కాశమిస్తే.. సమీప భ‌విష్య‌త్తులో ప‌దో జట్టుకు భారీగా డిమాండ్ పెరుగుతుంది.
  • రెండు జట్లను చేర్చడం వల్ల లీగ్​ ఫార్మాట్​ పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ఇందుకోసం ఐపీఎల్​ భాగస్వాములతో చర్చించాలి. మీడియా హక్కులను పునరుద్ధరించుకోవాలి. అదే మొత్తంగా 9 జట్లు ఉంటే మ్యాచుల సంఖ్య 74కు ప‌రిమితం అవుతుంది. దీనివ‌ల్ల టోర్నీ నిర్వ‌హ‌ణ పెద్ద క‌ష్టం కాదు.
  • ఇదీ చూడండి :త్వరలో ఐపీఎల్ వేలం.. ఫ్రాంచైజీలకు సూచన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details