ప్రపంచకప్‌లో గాయపడిన భారత ఓపెనర్ ధావన్ స్థానంలో పంత్ ఎంపికపై సందిగ్ధత నెలకొంది. శిఖర్‌కు ప్రత్యామ్నయం అవసరం లేదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ధావన్ కోసం చివరి లీగ్ మ్యాచ్ వరకు ఎదురు చూసేందుకు కెప్టెన్ కోహ్లి, చీఫ్ కోచ్ రవిశాస్త్రి సిద్ధంగా ఉన్నారని సహాయక కోచ్ సంజయ్ బంగర్ చెప్పాడు. కానీ అతడి స్థానంలో పంత్ సరైన ఎంపిక అని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్లు దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్‌సింగ్‌లు భావిస్తున్నారు.
‘‘సెలెక్షన్ కమిటీ నిర్ణయం పట్ల జట్టు మేనేజ్‌మెంట్ విముఖంగా ఉంది. ధావన్‌కు ప్రత్యామ్నాయంగా పంత్‌ను ఎంపిక చేస్తే మళ్లీ శిఖర్ జట్టులో చేరే అవకాశం ఉండదు. టీమ్‌ఇండియా సెమీస్ చేరినా అతడి సేవలు అందుబాటులో ఉండవు. ధావన్ చేతిని ప్లాస్టర్లతో కప్పేశారు. పరిస్థితి ఏమంత బాగాలేదు’’ -బీసీసీఐ అధికారి