ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా ఆటగాళ్లకు కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. దీంతో సిడ్నీ ఒలింపిక్ పార్క్‌లో ఆదివారం నుంచి టీమ్ఇండియా ఆటగాళ్లు పూర్తిస్థాయి నెట్సెషన్ను ప్రారంభించారు. ఇందులో వైట్-బాల్‌తో పాటు రెడ్-బాల్‌కూ ఒకేసారి శిక్షణ కసరత్తు చేస్తున్నారు.
రెడ్ బాల్‌తోనూ సాధన
శిక్షణలో భాగంగా ఆటగాళ్లందరూ వ్యాయామాలు, రన్నింగ్ వర్కౌట్లను చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్లతో పాటు టెస్టు జట్టూ కలిసి ఉన్నందున వైట్ బాల్‌తో పాటు రెడ్ బాల్‌తోనూ నెట్స్‌లో ప్రాక్టీసు చేయిస్తున్నారు. బీసీసీఐ తాజాగా పంచుకున్న వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెస్టు స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారా ఎర్రబంతితో క్యాచ్‌లు ప్రాక్టీసు చేస్తున్నారు. మరోవైపు టీమ్ఇండియాకు తొలిసారి ఎంపికైన టి. నటరాజన్ కూకాబుర్రా వైట్-బాల్‌తో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. దాదాపు అన్ని ఫార్మాట్లలోని టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేశాడు.