తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి వన్డేలో ఈ రికార్డుల్ని అధిగమిస్తారా? - cricket news

ముంబయి వాంఖడే మైదానంలో జరిగే తొలి వన్డేలో ఇరుజట్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. మరి వాటిని బద్దలు కొడతారా? లేదా అనేది చూడాలి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

తొలి వన్డేలో ఈ రికార్డుల్ని అధిగమిస్తారా?
భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే

By

Published : Jan 14, 2020, 6:46 AM IST

మూడు వన్డేల సిరీస్​లో భాగంగా భారత్​- ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు తొలి మ్యాచ్​ జరగనుంది. ముంబయిలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొన్ని రికార్డులు వేచి చూస్తున్నాయి. అవి ఈ మ్యాచ్​లో బద్దలవుతాయేమో చూడాలి.

రోహిత్- ధావన్.. ఓ రికార్డు

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌.. అరుదైన రికార్డుపై కన్నేశారు. ఆస్ట్రేలియాపై ఈ జోడీ, శతక భాగస్వామ్యం నెలకొల్పితే వన్డేల్లో ఒకే జట్టుపై అత్యధిక శతక భాగస్వామ్యాలు సాధించిన ఓపెనర్లుగా రికార్డు సృష్టిస్తారు. వెస్టిండీస్ ఆటగాళ్లు గ్రీనిడ్జ్‌-హేన్స్‌.. భారత్‌పై 6 శతక భాగస్వామ్యాలు నమోదు చేశారు. వీరితో రోహిత్‌-ధావన్‌ జోడీ సమంగా ఉంది.

కుల్దీప్​ రికార్డు

కుల్దీప్ యాదవ్ 56 వన్డేల్లో 99 వికెట్లు తీశాడు. ఈ రోజు మరో వికెట్ తీస్తే అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్​గా నిలుస్తాడు. అలాగే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత స్పిన్నర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

ఆసీస్ రికార్డు

వాంఖడే మైదానంలో ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లోనే ఓడిపోయింది. 1996లో 16 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన కంగారూలు.. 2003లో 77 పరుగుల తేడాతో గెలిచారు.

ABOUT THE AUTHOR

...view details