ప్రపంచకప్ ముందు స్వదేశంలో జరిగిన చివరి సిరీస్‌లో ఓటమి పాలైంది టీమిండియా. సిరీస్‌పై గెలుపు అంచనాల్లేని ఆస్ట్రేలియా జట్టు విజయంతో పాటు పలు రికార్డులను సొంతం చేసుకుంది. భారత్‌లో టీంఇండియాపై 2009లో వన్డే సిరీస్ గెలిచింది ఆసీస్. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు విజయం సాధించారు.
కోహ్లీ తొలిసారి...
2016లో కోహ్లీ వన్డే జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత టీమిండియా ఓడిన మొదటి సిరీస్ ఇదే.
తొలి జట్టు...
ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసింది ఈ సిరీస్‌లోనే
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఖవాజా అదిరే ప్రదర్శన..
383 పరుగులు చేసిన ఖవాజా 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు. ఇందులో రెండు శతకాలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆసిస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఖవాజా ఉన్నాడు. అతడి కంటే ముందు డేవిడ్ వార్నర్ 386 పరుగులతో ఉన్నాడు. 2016లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు.
మ్యాన్ అఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఖవాజా టీమిండియాపై మాత్రం ఖవాజావే అత్యధిక పరుగులు. ఇంతకు ముందు న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ పేరిట 361 పరుగులతో ఈ రికార్డు ఉంది.
మూడో వ్యక్తి రోహిత్ శర్మ...
భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఐదో వన్డేలో 41వ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు రోహిత్ శర్మ. వన్డేల్లో వేగంగా 8000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన తొమ్మిదో ఆటగాడు రోహిత్. 200 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఇతని కన్నా ముందు డివిలియర్స్, కోహ్లి ఉన్నారు. మూడో స్థానాన్ని గంగూలీతో కలిసి పంచుకున్నాడు రోహిత్ శర్మ.