తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పుడేముంది.. ఇప్పుడైతే మరో 4 వేలు చేసేవాళ్లం' - వన్డేల్లో రికార్డు భాగస్వామ్యం

సచిన్​, గంగూలీలది వన్డేల్లో విజయవంతమైన భాగస్వామ్యమని తాజాగా ఐసీసీ ట్వీట్​ చేసింది. దీనిపై సచిన్​ స్పందిస్తూ.. ప్రస్తుతం క్రికెట్​లో ఉన్న నిబంధనలు అప్పుడు ఉండి ఉంటే తమ భాగస్వామ్యంలో మరిన్ని పరుగులు రాబట్టేవాళ్లమన్నాడు.

RECORD ODI PARTNERSHIP BETWEEN SACHIN AND GANGULY
'అలా అయితే మరో 4 వేల పరుగులు చేయోచ్చు'

By

Published : May 13, 2020, 7:40 AM IST

సచిన్‌, గంగూలీలు వన్డేల్లో అత్యంత విజయవంతమైన భాగస్వామ్యం. ఈ ద్వయం తమ పార్ట్నర్​షిప్​లో 47.55 సగటుతో 8227 పరుగులు చేసింది. ఐసీసీ వాళ్లిద్దరూ ఆడిన ఓ మ్యాచ్‌ ఫొటోతో పాటు ఈ గణాంకాలనే ట్వీట్‌ చేస్తూ.. మరేవరూ వన్డేల్లో కనీసం 6 వేలు దాటలేదని పేర్కొంది. దీనిపై సచిన్‌ స్పందిస్తూ.. ఇప్పుడున్న ఫీల్డింగ్‌, బౌలింగ్‌ నిబంధనలు అప్పుడుంటే తాము మరిన్ని పరుగులు చేసే వాళ్లమని అన్నాడు.

"ఈ ట్వీట్‌తో నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి దాది. రింగ్‌ వెలుపల నలుగురు ఫీల్డర్లు ఉండాలన్న నిబంధన, రెండు కొత్త బంతుల నిబంధన అప్పుడు ఉండి ఉంటే మనం ఇంకెన్ని పరుగులు చేసే వాళ్లమని అనుకుంటున్నావు?" అంటూ గంగూలీని ట్యాగ్‌ చేశాడు సచిన్‌. దీనికి గంగూలీ బదులిచ్చాడు. "మరో 4000 లేదా అంతకన్నా ఎక్కువ చేసేవాళ్లం. రెండు కొత్త బంతులు అనగానే తొలి ఓవర్లో మాదిరే చివరి వరకూ కవర్‌డ్రైవ్‌లు బౌండరీలకు దూసుకెళ్లేవి" అని అన్నాడు.

ఇదీ చూడండి.. మరపురాని మెరుపులు: లంకపై 'వీర' బాదుడు

ABOUT THE AUTHOR

...view details