తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాక్సింగ్​ డే టెస్టుకు రికార్డు వీక్షకుల హాజరు - రెండవ అతిపెద్ద బాక్సింగ్​ డే టెస్ట్​

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న టెస్టుకు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు 80వేల మందికి పైగా వీక్షకులతో ​స్టేడియం కిక్కిరిసిపోయింది. మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో ఇప్పటివరకు ఇదే అత్యధికం.

record-crowd-for-australia-new-zealand-test
బాక్సింగ్​ డే టెస్ట్​లో రికార్డు వీక్షకుల హాజరు

By

Published : Dec 26, 2019, 6:17 PM IST

బాక్సింగ్​ డే టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ మధ్య గురువారం మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్టుకు 80వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. క్రికెట్​ చరిత్రలో ఇదో అరుదైన ఘనత అని మ్యాచ్ నిర్వాహకులు తెలియజేశారు.

మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో అత్యధికంగా ప్రేక్షకులు హాజరైన సంఖ్య ఇప్పటి వరకు 51,087గా ఉంది. తాజాగా జరిగిన బాక్సింగ్​ డే మ్యాచ్​లో తొలిరోజైన గురువారం 80,473 మంది అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. నాన్​ యాషెస్​ మ్యాచ్​లో ఇది రెండోస్థానం. 1975లో వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో 85,661 మంది వీక్షకులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:- రివ్యూ 2019: కొంచెం తీపి.. కొంచెం చేదు

ABOUT THE AUTHOR

...view details