టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. సతీమణి సంజనా గణేశన్‌తో కలిసి వివాహ బంధాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే ఆమె ఈ మధ్య పెట్టిన బీచ్ ఫొటోకు బదులుగా బుమ్రా కామెంట్ చేశాడు. 'ఆ ఫొటో తీసిన వ్యక్తి చాలా మంచోడు' అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సంజన.. 'అందుకే అతడ్ని పెళ్లి చేసుకున్నా' అనే వ్యాఖ్యతో పాటు నవ్వుతున్న ఏమోజీలను జత చేసింది.
బుమ్రాను అందుకే పెళ్లి చేసుకున్నా: సంజనా గణేశన్ - cricket news
క్రికెటర్ బుమ్రాను వివాహం చేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది సంజనా గణేశన్. ఇంతకీ ఆమె చెప్పింది? వీరి పెళ్లి గతనెల 15న గోవాలో జరిగింది.
బుమ్రాను అందుకే పెళ్లి చేసుకున్నా: సంజనా గణేశన్
మార్చి 15న గోవాలో, బుమ్రా-సంజనా గణేశన్‌ల పెళ్లి జరిగింది. కేవలం ఇరుకుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.