ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన దారుణ అత్యాచార ఘటనపై టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. అది అమానవీయ, క్రూరత్వానికి మించిన ఘటన అని ఆవేదన వ్యక్తంచేశాడు. "హాథ్రస్‌లో జరిగిన ఘటన అమానవీయమైంది. క్రూరత్వానికి మించినది. దానికి కారకులైన వారికి శిక్ష పడుతుందని ఆశిస్తున్నా" అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
క్రూరత్వానికి మించిన ఘటన ఇది: కోహ్లీ
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై స్పందించాడు టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇది క్రూరత్వానికి మించిన చర్యగా పేర్కొన్నాడు. ఈ దారుణానికి పాల్పడిన వారికి శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
కోహ్లీ
రెండు వారాల క్రితం హాథ్రస్‌లో ఓ దళిత యువతిపై ఉన్నత వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏ మాత్రం జాలి లేకుండా ఆమె నాలుకను కూడా కోశారు. తీవ్రంగా గాయపడిన ఆమె దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.