తెలంగాణ

telangana

ETV Bharat / sports

పెళ్లికి సిద్ధమైన ఆర్సీబీ స్పిన్నర్ - ipl news

ఈ ఐపీఎల్​ కోసం తమ జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమవుతోందని ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెసన్ స్పష్టం చేశారు. డివిలియర్స్ మార్చి 28న భారత్​కు వస్తాడని వెల్లడించారు.

RCB's camp for IPL 2021 to start on March 29: Mike Hesson
పెళ్లికి సిద్ధమైన ఆర్సీబీ స్పిన్నర్.. త్వరలో ట్రైనింగ్​

By

Published : Mar 24, 2021, 2:26 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ ఆడమ్ జంపా.. త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్​లో తొలి మ్యాచ్​ మిస్ కానున్నాడని ఆ జట్టు డైరెక్టర్ మైక్ హెసన్ చెప్పాడు.

ఆర్సీబీ ట్రైనింగ్ క్యాంప్.. మార్చి 29 నుంచి మొదలుకానుందని వెల్లడించాడు. ఏబీ డివిలియర్స్.. అంతకు ఒకరోజు ముందే ఇండియా చేరుకుంటారని అన్నాడు.

ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్​లోని తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో బెంగళూరు జట్టు తలపడనుంది. కొవిడ్ వ్యాప్తి కారణంగా ఈసారి కేవలం ఆరు వేదికల్లోనే మ్యాచ్​లు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details