పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని అభిప్రాయపడ్డాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆటగాడు, దక్షిణాఫ్రికా పేస్ దళపతి డేల్ స్టెయిన్. ఈ విషయాన్నిఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ లీగ్లో రెండుసార్లు ఛాంపియన్ అయిన ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున స్టెయిన్ ఆడనున్నాడు.
"పాకిస్థాన్లోని అందరికి హలో! మీకో చిన్న కబురు చెప్పడానికి వచ్చాను. పీఎస్ఎల్ ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా. మీరంతా వచ్చి మా ఆటను ఆస్వాదించండి. ఈ టోర్నీ కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. మీ అందర్నీ అక్కడ కలుస్తా"