తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్​లో కప్పు గెలవడానికి జట్టే ముఖ్యం'

ఐపీఎల్​ వేలం ముందు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ) సారథి విరాట్​ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి జట్టును బలోపేతం చేసుకొని బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెప్పాడు. రేపు జరగనున్న వేలంపాటలో అన్ని విభాగాలను పటిష్ఠం చేసుకునేలా ఆటగాళ్ల ఎంపిక ఉంటుందని చెప్పాడు.

Virat Kohli to fans before IPL Auction
'ఐపీఎల్​లో కప్పు గెలవడానికి జట్టే ముఖ్యం'

By

Published : Dec 17, 2019, 8:30 PM IST

ప్రపంచ క్రికెట్​లో కెప్టెన్​గా, ఆటగాడిగా ఎన్నో రికార్డులు, టైటిళ్లు సాధించిన విరాట్​ కోహ్లీ... ఐపీఎల్​లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. 12 సీజన్లలో ఒక్కసారి తన జట్టు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ)కు కప్పు అందించలేకపోయాడు. అందుకే ఈ సారి జట్టు ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది ఫ్రాంఛైజీ. ఇందులో భాగంగానే ఐపీఎల్ 13వ​ సీజన్​ కోసం అన్ని విభాగాల్లోనూ సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలని ఆశపడుతున్నాడు విరాట్​. డిసెంబర్​ 18న(బుధవారం) కోల్​కతాలో ఐపీఎల్​-2020 వేలంపాట జరగనుంది.

విరాట్​ కోహ్లీ

ఇటీవల జరిగిన ట్రేడింగ్​ విండోలో కొంత మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న బెంగళూరు జట్టు.. మరికొంతమంది స్టార్​ ప్లేయర్లను విడిచిపెట్టింది. ఫ్రాంఛైజీ వద్ద మిగులు నిధులు రూ.27.90 కోట్లు ఉండగా... ఈ మొత్తంతో జట్టు అత్యధికంగా 12 మంది ఆటగాళ్లను కొనుక్కోవచ్చు. వీరిలో ఆరుగురు స్వదేశీ, మరో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు అవసరం.

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:

విరాట్‌ కోహ్లీ, మొయిన్‌ అలీ, యుజువేంద్ర చాహల్‌, ఏబీ డివిలియర్స్‌, పార్థివ్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌ యాదవ్‌, గురుకీరత్‌ మన్‌, దేవదత్‌ పడిక్కల్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైని

విడుదల చేసిన ప్లేయర్లు:

మార్కస్‌ స్టొయినిస్‌, హెట్‌మెయిర్‌, అక్షదీప్‌ నాథ్‌, నాథన్‌ కల్టర్‌నైల్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, ప్రయాస్‌ బర్మన్‌, టిమ్‌ సౌథీ, కుల్వంత్‌ కేజ్రోలియా, హిమ్మత్‌ సింగ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, మలింగ్‌ కుమార్‌, డేల్‌ స్టెయిన్‌

ABOUT THE AUTHOR

...view details