ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలకు గుడ్‌బై చెప్పిన మైక్ హెసన్.. మళ్లీ ఇదే లీగ్‌లో కనిపించనున్నాడు. అయితే ఇప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)జట్టుకు సేవలందించనున్నాడు. వచ్చే ఐపీఎల్‌కు సంబంధించి ముందుగానే ప్రణాళిక రచిస్తోన్న ఆర్సీబీ.. మైక్ హెసన్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్(డీసీఓ)గా ఎంపిక చేసింది.
ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం పోటీపడ్డ హెసన్‌కు నిరాశ ఎదురైంది. మరోసారి రవిశాస్త్రినే కోచ్‌గా కొనసాగించేందుకు సెలక్టర్లు మొగ్గుచూపడం వల్ల హెసన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.